మూసీ సుందరీకరణ పేరుతో అదనపు భూసేకరణ ఆపాలి....ఎమ్మెల్యే టి. ప్రకాష్ గౌడ్
మూసీ సుందరీకరణ పేరుతో బఫరోజోన్ కు మించి భూములు సేకరించడాన్ని నిలిపివేయాలని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టి. ప్రకాష్ గౌడ్ ప్రభుత్వాన్ని కోరారు.
Minister


హైదరాబాద్, 11 అక్టోబర్ (హి.స.)

మూసీ సుందరీకరణ పేరుతో

బఫరోజోన్ కు మించి భూములు సేకరించడాన్ని నిలిపివేయాలని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టి. ప్రకాష్ గౌడ్ ప్రభుత్వాన్ని కోరారు.

ఈ మేరకు జిల్లా ఇన్ఛార్జి మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబును ఆదివారం ఉదయం ఆయన అధికారిక నివాసంలో కలిసి సమస్యను వివరించారు.

ఎమ్మెల్యే ఆధ్వర్యంలో బండ్లగూడ జాగీర్లో లోని దర్గా ఖలీజ్ ఖాన్ ప్రాంతానికి చెందిన బాధిత నివాసితులు కూడా మంత్రిని కలిసి తమ ఆవేదనను వ్యక్తం చేశారు. మూసీ సుందరీకరణకు తాము వ్యతిరేకం కాదని, అయితే బఫర్ జోన్ పరిధిని దాటి 500 మీటర్ల వరకు భూములు సేకరించాలనే ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని నివాసితులు తెలిపారు.

బఫర్ జోన్ పరిధిలోని భూములకే సేకరణను పరిమితం చేయాలని, ఇతర అభివృద్ధి పనులు, హోటళ్ల నిర్మాణాల కోసం అదనపు భూములు సేకరించే ఆలోచనను విరమించుకోవాలని కోరారు.

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande