
ఖమ్మం, 11 అక్టోబర్ (హి.స.)
ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గ వేంసూరు మండలం కల్లూరుగూడెం గ్రామంలో గ్రామంలో ఆయిల్ ఫెడ్ రూ.115 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో అధునాతన మలేషియా టెక్నాలజీతో నూతనంగా నిర్మిస్తున్న పామ్ ఆయిల్ ఫ్యాక్టరీ పనులను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదివారం ఉదయం పరిశీలించారు.
అనంతరం ఫ్యాక్టరీ సమీపంలో ఆయిల్ పెడ్ అధికారులు ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి తుమ్మల మాట్లాడుతూ.. వేంసూరు ప్రాంత పామాయిల్ రైతుల ఉపయోగం కోసం నూతనంగా నిర్మిస్తున్న పామాయిల్ ఫ్యాక్టరీ పనులు ఈ నెలాఖరు పూర్తి చేయాలని మంత్రి తుమ్మల అధికారులను ఆదేశించారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఈ ఫ్యాక్టరీని నవంబర్ నెలలో ప్రారంభించుకొని రైతులకు అంకితం చేద్దామని ఆలోచనలో ఉన్నామని సమావేశంలో మంత్రి తుమ్మల వివరించారు.
ఫ్యాక్టరీ నిర్మాణం ప్రదేశాన్ని జరుగుతున్న పనుల వివరాలను మంత్రి తుమ్మల ఆయిల్ పేడ్ రాష్ట్ర ప్లాంట్స్ అండ్ ప్రాజెక్ట్ మేనేజర్ ఎన్ శ్రీకాంత్ రెడ్డిని అడిగి తెలుసుకున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..