తెలంగాణ రాజకీయాల్లో ఎన్నికల సంఘం అంశం చర్చనీయాంశం.. అక్టోబర్ 12 ఢిల్లీ నిరసనకు కాంగ్రెస్ నేతల సమీకరణ
ఎన్నికల సంఘం వ్యవహారంపై కాంగ్రెస్ పార్టీ చేపట్టనున్న నిరసన కార్యక్రమానికి తెలంగాణకు చెందిన ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులు హాజరుకావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చరు.
CM Revanth Reddy


హైదరాబాద్ , 11 అక్టోబర్ (హి.స.)ఎన్నికల సంఘం వ్యవహారంపై కాంగ్రెస్ పార్టీ చేపట్టనున్న నిరసన కార్యక్రమానికి తెలంగాణకు చెందిన ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులు హాజరుకావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చరు. అక్టోబర్ 12న ఢిల్లీలో నిర్వహించనున్న ఈ నిరసన కార్యక్రమంలో ముఖ్యమంత్రి, మంత్రులు పాల్గొననున్నారు.

ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఈ కార్యక్రమం ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలనే డిమాండ్తో చేపడుతున్నారు. తెలంగాణకు చెందిన ఎంపీలు, రాజ్యసభ సభ్యులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, పార్టీ సీనియర్ నాయకులు కార్యక్రమంలో పాల్గొనాలని కోరారు.

దేశంలో ఎన్నికల ప్రక్రియ, ఓటర్ల జాబితా సవరణ, ఎన్నికల సంఘం పనితీరు వంటి అంశాలు రాజకీయ పార్టీల మధ్య చర్చకు దారితీస్తుంటాయి. ఓటర్ల జాబితాలో అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఉండటం, అనర్హమైన నమోదులను గుర్తించడం, ఎన్నికల ప్రక్రియపై ప్రజల్లో విశ్వాసం కొనసాగడం ప్రజాస్వామ్య వ్యవస్థకు కీలకం. అదే సమయంలో ఓటర్ల జాబితా సవరణలపై రాజకీయ పార్టీలు వ్యక్తం చేసే అభ్యంతరాలను సంబంధిత అధికారులు పరిశీలించడం, ప్రజలకు స్పష్టమైన వివరణలు ఇవ్వడం అవసరం. ఎన్నికల సంఘం వంటి రాజ్యాంగ సంస్థలపై విమర్శలు వచ్చినప్పుడు ఆరోపణలు, అధికారిక స్పందనలు, అందుబాటులో ఉన్న ఆధారాలను వేర్వేరుగా పరిశీలించాలి.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande