రైల్వే స్టేషన్ లో ప్రయాణికుల రద్దీ
రైల్వేస్టేషన్ లో ప్రయాణికుల రద్దీ మొదలైంది. దసరా సెలవుల నేపథ్యంలో రాష్ట్ర ఆర్థిక రాజధాని విశాఖ నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులతో రైళ్లు కిక్కిరిసి పోతున్నాయి.
Train


అమరావతి, 11 అక్టోబర్ (హి.స.) రైల్వేస్టేషన్ లో ప్రయాణికుల రద్దీ మొదలైంది. దసరా సెలవుల నేపథ్యంలో రాష్ట్ర ఆర్థిక రాజధాని విశాఖ నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులతో రైళ్లు కిక్కిరిసి పోతున్నాయి.

శనివారం మధ్యాహ్నం విశాఖ నుంచి విజయవాడ వెళ్లే ‘రత్నాచల్’లోకి అడుగుపెట్టేందుకు కూడా వీలుపడనంతగా కిటకిటలాడిపోయింది (చిత్రాల్లో). సీట్లు కోసం బోగీల కిటికీల్లోనుంచి కూడా కొందరు లోపలికి ప్రవేశించారు. పిల్లలు, వృద్ధులు అవస్థలకు గురయ్యారు.

మరికొన్ని రోజులు పరిస్థితి ఇలాగే ఉండే అవకాశం ఉంది. దీంతో కొన్ని రైళ్ల వద్దనైనా ప్రయాణికులు వరుస క్రమం పాటించేలా అధికారులు తగు చర్యలు తీసుకోవాలని పలువురు సూచిస్తున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande