హైదరాబాద్లో ఓపెన్ స్కూల్ పరీక్షలకు ఏర్పాట్లు, విద్యార్థుల హాజరుపై దృష్టి
తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించే పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలకు హైదరాబాద్లో ఏర్పాట్లు చేశారు.
School


హైదరాబాద్ , 11 అక్టోబర్ (హి.స.)

తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించే పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలకు హైదరాబాద్లో ఏర్పాట్లు చేశారు. అక్టోబర్ 11 నుంచి ప్రారంభమయ్యే పరీక్షలకు సంబంధించి 16 కేంద్రాల్లో 5,614 మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. ఓపెన్ స్కూల్ విధానం ద్వారా సాధారణ పాఠశాలలకు వెళ్లలేని వారు, మధ్యలో చదువు నిలిపివేసినవారు, ఉద్యోగాలు లేదా ఇతర బాధ్యతల కారణంగా సంప్రదాయ విద్యా విధానంలో కొనసాగలేని వారు తమ చదువును పూర్తి చేసుకునే అవకాశం పొందుతారు.

పరీక్షలు రెండు విడతల్లో నిర్వహించనున్నారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఒక సెషన్, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు మరో సెషన్ ఉంటుంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande