తప్పు చేసినవారు చట్టం నుంచి తప్పించుకోలేరు: మంత్రి కొల్లు రవీంద్ర
షెల్ కంపెనీల ద్వారా నిధుల మళ్లింపుపై విచారణ వేగవంతం కావాలని రాష్ట్ర గనులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర డిమాండ్ చేశారు.
కొల్లు రవీంద్ర


అమరావతి, 11 అక్టోబర్ (హి.స.)

షెల్ కంపెనీల ద్వారా నిధుల మళ్లింపుపై విచారణ వేగవంతం కావాలని రాష్ట్ర గనులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర డిమాండ్ చేశారు.

ఈ రోజు ఆదివారం రాజధాని అమరావతిలో ఆయన విలేకర్లతో మాట్లాడుతూ..వైఎస్ జగన్పై ఉన్న ఆర్థిక నేరాల కేసుల నుంచి ప్రజల దృష్టి మళ్లించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. కేసుల విచారణ ఆలస్యమైనా తప్పు చేసినవారు చట్టం నుంచి తప్పించుకోలేరని అన్నారు.

సీబీఐ కేసులు ఉన్నంత మాత్రాన ఈడీ విచారణ ఆగదు. ఈడీ విచారణకు రాజకీయ రంగులు పులమడం సరికాదు. డబ్బుంటే కేసులు మాఫీ చేసుకోవచ్చా? విచారణ సాగదీయొచ్చా? వ్యక్తిగత హాజరుపై నిర్ణయం కోర్టులదే.

ప్రభుత్వానికి సంబంధం లేదు. ఆర్థిక నేరాల కేసుల విచారణ వేగవంతం చేసి ప్రజలకు నిజాలు వెల్లడించాలి. ఆలస్యమైనా.. తప్పు చేసినవారు చట్టం నుంచి తప్పించుకోలేరు” అని కొలు రవీంద అన్నారు.

వాస్తవాలను పక్కదారి పట్టించి రాజకీయ లబ్ధి పొందడమే జగన్ నీతి అని అభివర్ణించారు.షెల్ కంపెనీల ద్వారా నిధుల మళ్లింపుపై విచారణ వేగవంతం కావాలని ఆకాంక్షించారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసును టీడీపీ అధినేత, సీఎం నారా చంద్రబాబు నాయుడుకు ఆపాదించేలా గతంలో ప్రచారం చేశారని గుర్తు చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande