
హైదరాబాద్, 13 అక్టోబర్ (హి.స.) చంచల్ గూడా జైలులో ఉన్న నిమ్స్ అదనపు సూపరింటెండెంట్ డాక్టర్ లక్ష్మీ భాస్కర్ ను అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) అధికారులు నేడు తమ కస్టడీలోకి తీసుకున్నారు.
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో భాగంగా ఆయనను మూడు రోజుల పాటు విచారించనున్నారు. ఇప్పటికే ఈ కేసులో భారీగా ఆస్తులను గుర్తించిన ఏసీబీ అధికారులు, వాటి కొనుగోలుకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలు, బినామీ ఆస్తుల వివరాలపై ఆరా తీయనున్నారు.
ఆస్తుల సమీకరణకు సంబంధించిన ఆధారాలు, లావాదేవీల వెనుక ఉన్న వ్యక్తుల వివరాలను సేకరించడం పై దృష్టి సారించారు. కస్టడీ విచారణలో మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు