మున్సిపాలిటీలకు రూ.296 కోట్ల నిధులు మంజూరు
16వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు రాష్ట్రానికి కేటాయించిన నిధుల్లో నుంచి మున్సిపాలిటీల వాటా కింద రూ.296 కోట్లను ప్రభుత్వం తాజాగా విడుదల చేసింది.
Telangana


హైదరాబాద్, 13 అక్టోబర్ (హి.స.)

మున్సిపాలిటీలను ఆర్థికంగా బలోపేతం చేసే దిశగా తెలంగాణ ప్రభుత్వం కీలక అడుగు వేసింది. 16వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు రాష్ట్రానికి కేటాయించిన నిధుల్లో నుంచి మున్సిపాలిటీల వాటా కింద రూ.296 కోట్లను ప్రభుత్వం తాజాగా విడుదల చేసింది. ఈ మేరకు రాష్ట్రంలోని వివిధ పట్టణ ప్రాంతాల్లో అభివృద్ధి పనులకు మార్గం సుగమమైంది. కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన 16వ ఆర్థిక సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా, స్థానిక సంస్థలకు అందాల్సిన గ్రాంట్లలో రాష్ట్ర వాటాను ప్రభుత్వం సమకూర్చింది. ఆ నిధులను ప్రధానంగా పట్టణాల్లో పేరుకుపోతున్న చెత్తాచెదారం తొలగింపు, ఘన వ్యర్థాల నిర్వహణ, తాగునీటి సరఫరా వ్యవస్థల మెరుగుదల, లీకేజీల నివారణ, పాత మోటార్లు, పైపైన్ల మరమ్మతులు చేపట్టనున్నారు. గ్రామీణ, పట్టణ స్థానిక సంస్థలకు కేంద్రం నుంచి వస్తున్న నిధులను సద్వినియోగం చేసుకుంటూ, రాష్ట్రంలోని మున్సిపాలిటీలను మరింత ప్రగతిపథంలో నడిపించేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande