
ఖమ్మం, 13 అక్టోబర్ (హి.స.)
ఖమ్మం జిల్లా తిరుమల పాలెం మండలంలోని కాకరవాయి గ్రామంలో రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన రీ సర్వే ప్రక్రియకు సంబంధించిన డేటా ఎంట్రీని పూర్తి పారదర్శకంగా, తప్పులు లేకుండా నమోదు చేయాలని జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్ అన్నారు. మంగళవారం తిరుమలాయపాలెం మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. రీ సర్వేకు సంబంధించిన పూర్తి వివరాలను స్థానిక తహసీల్దార్ లూథర్ విల్సన్తో మాట్లాడి తెలుసుకున్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా, రెవెన్యూ రికార్డుల్లో స్పష్టత ఉండేలా క్షుణ్ణంగా డేటా ఎంట్రీ చేయాలని, భూ రికార్డులపై రైతులకు స్పష్టత కల్పించాలని ఆదేశించారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు