
అమరావతి, 13 అక్టోబర్ (హి.స.)
రాష్ట్ర ఎన్నికల సంఘం(SEC) ఆధ్వర్యంలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలతో కీలక సమావేశం నిర్వహించామని ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠ తెలిపారు.
స్థానిక ఎన్నికల నిర్వహణకు సంబంధించి రాజకీయ పార్టీల ప్రతినిధులతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ) అనిల్ చంద్ర పునేఠా సమావేశం నిర్వహించారు.
.ఈ అంశాలపై సంబంధిత జిల్లాల అధికారులకు అవసరమైన ఆదేశాలు జారీ చేస్తామని పేర్కొన్నారు. ప్రస్తుతం అమల్లో ఉన్న ఎన్నికల విధానాలను తక్షణమే మార్చడం సాధ్యం కాదని స్పష్టం చేశారు.
మొత్తం 20 రాజకీయ పార్టీలకు ఆహ్వానం అందించగా, 19 పార్టీల ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఎన్నికలను పారదర్శకంగా, చట్ట ప్రకారం నిర్వహించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై వివిధ రాజకీయ పార్టీలు తమ సూచనలు, అభిప్రాయాలను కమిషనర్ దృష్టికి తీసుకొచ్చాయి.
సంబంధిత విభాగాల నుంచి గెజిట్ నోటిఫికేషన్ రావాలని, ఎన్నికలకు సిద్ధంగా ఉన్నట్లు ప్రభుత్వం తెలిపిన తరువాతే నోటిఫికేషన్ గురించి ఆలోచిస్తామని తెలిపారు. కుల ధృవీకరణ పత్రాలు, నేటివిటీ (నివాస) సర్టిఫికెట్లను త్వరగా జారీ చేయాలని రాజకీయ పార్టీలు విజ్ఞప్తి చేశాయన్నారు. ఎన్నికల్లో ఓటర్లను ప్రభావితం చేసే మద్యం ప్రవాహాన్ని కంట్రోల్ చేయాలని ఎన్నికల సంఘానికి సూచించారని చెప్పారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV