గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష
ఢిల్లీలోని తన నివాసంలో మంగళవారం టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్తో కలిసి సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు.
Cm


హైదరాబాద్, 13 అక్టోబర్ (హి.స.)

ఢిల్లీలోని తన నివాసంలో మంగళవారం టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్తో కలిసి సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఢిల్లీలో అందుబాటులో ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర పార్టీ నేతలు ఈ సమావేశానికి హాజరయ్యారు.

గంటకుపైగా కొనసాగిన భేటీలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలతో పాటు రాష్ట్రంలో నెలకొన్న కరవు పరిస్థితులు, విద్యుత్ కొరత తదితర అంశాలపై చర్చించారు.

తెలంగాణలో జరగనున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. రాష్ట్రంలో రెండు ఎమ్మెల్సీ స్థానాలను గెలుచుకోవడమే లక్ష్యంగా పనిచేయాలని పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. ఎన్నికలను ఎవరూ తేలికగా తీసుకోవద్దని, తమ పరిధిలో బాధ్యతగా వ్యవహరిస్తూ గెలుపు కోసం కృషి చేయాలని స్పష్టం చేశారు.

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటర్ల నమోదు ప్రక్రియను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని రేవంత్ రెడ్డి సూచించారు. అర్హులైన పట్టభద్రులందరూ ఓటర్లుగా నమోదయ్యేలా చూడాలని, నమోదు ప్రక్రియ నుంచి పోలింగ్ వరకు ప్రతి దశను నిశితంగా పర్యవేక్షించాలని ఆదేశించారు. ఉమ్మడి జిల్లాల ఇన్ఛార్జ్ మంత్రులు, నియోజకవర్గ ఇన్ఛార్జ్లు ఎన్నికల వ్యవహారాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని స్పష్టం చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande