విజయవాడ చేరుకున్న తమిళనాడు సీఎం విజయ్...స్వాగతం పలికిన మంత్రి నారాయణ
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ కాసేపటి క్రితం విజయవాడకు చేరుకున్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆయన ఏపీకి రావడం ఇదే తొలిసారి.
విజయవాడ చేరుకున్న తమిళనాడు సీఎం విజయ్...స్వాగతం పలికిన మంత్రి నారాయణ


విజయవాడ, 13 అక్టోబర్ (హి.స.)తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ కాసేపటి క్రితం విజయవాడకు చేరుకున్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆయన ఏపీకి రావడం ఇదే తొలిసారి.

ఈ సందర్భంగా ఎయిర్పోర్టులో ఆయనకు ఏపీ పురపాలకశాఖ మంత్రి నారాయణ , ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి తో పాటు పలువురు ఉన్నతాధికారులు ఘన స్వాగతం పలికారు. అనంతర ఆయన నేరుగా గన్నవరం విమానాశ్రయం నుంచి సీఎం విజయ్ నేరుగా ఇంద్రకీలాద్రికి బయలుదేరారు. ఇంద్రకీలాద్రిపై వెలసిన విజయవాడ కనకదుర్గమ్మను తమిళనాడు సీఎం జోసెఫ్ విజయ్ దర్శించుకున్నారు. ఈరోజు(మంగళవారం) దుర్గమ్మ సన్నిధికి చేరుకున్న విజయ్కు దుర్గగుడి అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు.

అమ్మవారి ఆశీస్సులు తీసుకున్న అనంతరం ఆయన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నివాసానికి వెళ్లనున్నారు.

ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలో ప్రధానంగా అంతర్రాష్ట్ర జలాల గురించి చర్చించనున్నట్లు తెలుస్తోంది. తెలుగు గంగ ప్రాజెక్టు ద్వారా చెన్నై నగరానికి కృష్ణా జలాల సరఫరా, గోదావరి-కావేరి నదుల అనుసంధానం వంటి కీలక అంశాలు వీరి మధ్య ప్రస్తావనకు రానుంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande