దసరా సెలవులతో యాదాద్రిలో కిటకిటలాడుతున్న భక్తుల రద్దీ
ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారి ఆలయం దసరా పండుగ శరన్నవరాత్రుల నేపథ్యంలో భక్తుల నామస్మరణతో మార్మోగుతోంది.
Temple


హైదరాబాద్ , 13 అక్టోబర్ (హి.స.)ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారి ఆలయం దసరా పండుగ శరన్నవరాత్రుల నేపథ్యంలో భక్తుల నామస్మరణతో మార్మోగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలలకు దసరా వి సెలవులు ప్రారంభం కావడంతో నలుమూలల నుంచి కుటుంబ సమేతంగా భక్తులు యాదగిరిగుట్టకు భారీగా తరలివస్తున్నారు.

స్వామివారి ధర్మదర్శనం, శీఘ్ర దర్శనం క్యూలైన్లన్నీ కిక్కిరిసిపోయాయి. కొండపై ఉన్న లక్ష్మీపుష్కరిణి, వ్రత మండపాలు, ప్రసాద విక్రయ కేంద్రాల వద్ద సందడి నెలకొంది. ఈ పవిత్ర దసరా నవరాత్రులను పురస్కరించుకుని ప్రధాన ఆలయంలో స్వామి, అమ్మవార్లకు రోజువారీ నిత్యారాధనలతో పాటు శ్రీ సుదర్శన నారసింహ హవనం, మూలమంత్ర జపాలు శాస్త్రోక్తంగా జరుగుతున్నాయి. దర్శనాలకు అధిక సమయం పడుతుండటంతో ఉచిత మంచినీరు, పాలు, మజ్జిగ పంపిణీకి దేవస్థానం అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande