హైదరాబాద్ మెట్రో ఫేజ్-2 కన్సల్టెన్సీ టెండర్ల గడువు పొడిగింపు
రాజధాని హైదరాబాద్ నగరాన్ని రవాణా పరంగా మరింత అనుసంధానించే ప్రతిష్టాత్మక మెట్రో రెండో దశ విస్తరణ పనులలో ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది.
metro


హైదరాబాద్ , 13 అక్టోబర్ (హి.స.)రాజధాని హైదరాబాద్ నగరాన్ని రవాణా పరంగా మరింత అనుసంధానించే ప్రతిష్టాత్మక మెట్రో రెండో దశ విస్తరణ పనులలో ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది. మొత్తం రూ. 38,595 కోట్ల అంచనా వ్యయంతో 122.9 కిలోమీటర్ల మేర నిర్మించ తలపెట్టిన 7 కారిడార్లలో మొదటి విడతగా నాలుగు ప్రధాన మార్గాలకు సంబంధించి 'జనరల్ కన్సల్టెంట్స్' (GCs) నియామక ప్రక్రియ నడుస్తోంది.

రాయదుర్గం-కోకాపేట (11.6 కి.మీ.), ఎంజీబీఎస్-చాంద్రాయణగుట్ట (7.5 కి.మీ.), ఎల్బీనగర్-హయత్నగర్ (7.1 కి.మీ.), మరియు మియాపూర్-పటాన్చెరు (13.4 కి.మీ.) మార్గాల పర్యవేక్షణ బాధ్యతల కోసం పిలిచిన కన్సల్టెన్సీ బిడ్ల గడువును ఈ నెల 22 వరకు పొడిగిస్తున్నట్లు హెచ్ఎంఆర్ఎల్ ప్రకటించింది. సాంకేతిక, ఆర్థిక ప్రతిపాదనలలో పారదర్శకత ఉండేలా 'క్వాలిటీ కమ్ కాస్ట్ బేస్డ్ సెలక్షన్' విధానంలో కన్సల్టెంట్లను ఎంపిక చేయనున్నారు. ఇదే సమయంలో పాతబస్తీ కారిడార్ నిర్మాణానికి ఆటంకంగా ఉన్న పెండింగ్ ఆస్తుల సేకరణను ఈ నెలాఖరుకల్లా పూర్తి చేయాలని అధికారులు నిర్ణయించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande