కాంగ్రెస్ ప్రభుత్వం పై హరీష్ రావు ఆగ్రహం
తెలంగాణ రైతు పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (టీజీఆర్ పీడీసీఎల్) ఉద్యోగులు, విద్యుత్ పంపిణీ నెట్ వర్క్, ఆస్తులు, అప్పులు, విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు ఇతర బాధ్యతలను బదిలీ చేస్తూ ప్రభుత్వం జీవో 17ను జారీ చేయడంపై బీఆర్ఎస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిం
Harish Rao


హైదరాబాద్, 13 అక్టోబర్ (హి.స.)

తెలంగాణ రైతు పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (టీజీఆర్ పీడీసీఎల్) ఉద్యోగులు, విద్యుత్ పంపిణీ నెట్ వర్క్, ఆస్తులు, అప్పులు, విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు ఇతర బాధ్యతలను బదిలీ చేస్తూ ప్రభుత్వం జీవో 17ను జారీ చేయడంపై బీఆర్ఎస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

రైతు డిస్కమ్ పేరుతో ఉచిత విద్యుత్కు ఎసరు పెట్టే కుట్ర అని మాజీ మంత్రి హరీశ్ రావు విమర్శించారు. ఈ మేరకు మంగళవారం ఓ ప్రకటన విడుదల చేసిన ఆయన.. ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ సహా ఇతర రాజకీయ పార్టీలు, ఉద్యోగ సంఘాలు, విద్యుత్ రంగ నిపుణులు, సామాజికవేత్తలు, రైతులు లేవనెత్తుతున్న అభ్యంతరాలను బేఖాతరు చేస్తూ రైతు డిస్కమ్ ఏర్పాటు చేస్తూ జీవోజారీ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.

వ్యవసాయానికి, గృహాలకు, పరిశ్రమలకు నిరంతర విద్యుత్ సరఫరా చేయలేకపోతున్న కాంగ్రెస్ ప్రభుత్వం.. ఇప్పుడు రైతు డిస్కమ్ పేరుతో మరో డ్రామాకు తెరతీయడం సిగ్గుచేటు అని, రైతు డిస్కమ్ ఏర్పాటు జీవో జారీ కాంగ్రెస్ ప్రభుత్వ నిరంకుశ, దుర్మార్గ వైఖరికి నిదర్శనం అన్నారు.

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande