నిజామాబాద్ పసుపు బోర్డు విస్తరణకు కార్యాచరణ వేగవంతం
నిజామాబాద్ కేంద్రీకృతంగా ఏర్పాటవుతున్న జాతీయ పసుపు బోర్డు (National Turmeric Board) కార్యకలాపాలను మరింత ముమ్మరం చేసేందుకు కేంద్ర, రాష్ట్ర వ్యవసాయాధికారుల బృందం క్షేత్రస్థాయి పరిశీలన జరిపింది.
Turmaric board


హైదరాబాద్ , 13 అక్టోబర్ (హి.స.)నిజామాబాద్ కేంద్రీకృతంగా ఏర్పాటవుతున్న జాతీయ పసుపు బోర్డు (National Turmeric Board) కార్యకలాపాలను మరింత ముమ్మరం చేసేందుకు కేంద్ర, రాష్ట్ర వ్యవసాయాధికారుల బృందం క్షేత్రస్థాయి పరిశీలన జరిపింది. రైతులకు నాణ్యమైన విత్తనాలు, శుద్ధి కేంద్రాలు మరియు ఎగుమతి అవకాశాలు కల్పించే దిశగా ప్రణాళికలు రూపొందిస్తున్నారు.

ఉమ్మడి నిజామాబాద్, జగిత్యాల జిల్లాల్లో పండించే పసుపునకు అంతర్జాతీయ విపణిలో సరైన మద్దతు ధర లభించేలా ఇ-నామ్ (e-NAM) ప్లాట్ఫామ్లతో అనుసంధానించాలని నిర్ణయించారు. స్థానిక వ్యాపారులు, పసుపు రైతు సంఘాల నాయకులతో నిర్వహించిన సమావేశంలో వారి సూచనలను స్వీకరించిన అధికారులు, త్వరలోనే ప్రాసెసింగ్ యూనిట్లకు సంబంధించి కీలక స్పష్టత రానుందని తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande