
రామగుండం, 13 అక్టోబర్ (హి.స.)
పెండింగ్ కేసుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సాధించడంతోపాటు నేరాల నియంత్రణకు పటిష్ట చర్యలు తీసుకోవాలని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఆదేశించారు.
మంగళవారం రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పెద్దపల్లి, మంచిర్యాల జోన్ల పోలీస్ అధికారులతో కమిషనరేట్ కార్యాలయంలో నేర సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్, డివిజన్, జోన్ల వారీగా పెండింగ్ కేసుల స్థితిగతులను సమీక్షించారు. నిందితుల అరెస్టు, దర్యాప్తు, సాక్ష్యాధారాల సేకరణ, చార్జిషీట్ దాఖలు తదితర అంశాలపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. చట్టప్రకారం నిష్పక్షపాతంగా నిర్ణయాలు తీసుకోవాలని, సమర్థవంతంగా పనిచేసే అధికారులకు పోలీస్ శాఖ అండగా ఉంటుందని తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..