సచివాలయం వద్ద ఆందోళన నిర్వహించిన రిటైర్డ్ ఉద్యోగులు
రిటైర్డ్ ఉద్యోగులు మంగళవారం తెలంగాణ సచివాలయం వద్ద ఆందోళనకు దిగారు. రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు చేపట్టిన 'చలో సెక్రటేరియట్' కార్యక్రమానికి విశ్రాంత ఉద్యోగులు తరలివచ్చారు.
Secretariat


హైదరాబాద్, 13 అక్టోబర్ (హి.స.)

తెలంగాణ సచివాలయం వద్ద రిటైర్డ్ ఉద్యోగులు మంగళవారం ఆందోళనకు దిగారు. రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు చేపట్టిన 'చలో సెక్రటేరియట్' కార్యక్రమానికి విశ్రాంత ఉద్యోగులు తరలివచ్చారు.

పదవీ విరమణ చేసి రెండేళ్లకు పైగా గడుస్తున్నా తమకు రావలసిన రిటైర్మెంట్ బెనిఫిట్స్, పీఆర్సీ (PRC) బకాయిలను ప్రభుత్వం విడుదల చేయడం లేదని నిరసన వ్యక్తం చేశారు. సచివాలయం వద్ద ఆందోళనకు దిగిన విశ్రాంత ఉద్యోగులను పోలీసులు అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు. కాగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న దాదాపు 26,000 మంది ప్రభుత్వ పెన్షనర్లు 2024 మార్చి నుండి రావాల్సిన బకాయిల కోసం సుదీర్ఘకాలంగా పోరాడుతున్నారు. రిటైర్మెంట్ బెనిఫిట్లు సమయానికి అందకపోవడంతో రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 105 మంది విశ్రాంత ఉద్యోగులు తీవ్ర అనారోగ్యం, క్యాన్సర్ వంటి వ్యాధులతో బాధపడుతూ సరైన వైద్యం అందక మృతి చెందారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande