సింగరేణి విస్తరణ మరియు కార్మికుల సంక్షేమంపై యాజమాన్యం భేటీ
కొత్తగూడెం సింగరేణి ప్రధాన కార్యాలయం వేదికగా బొగ్గు ఉత్పత్తి లక్ష్యాలు, కొత్త ఓపెన్ కాస్ట్ (ఓసిపి) గనుల విస్తరణ మరియు కార్మికుల రక్షణ చర్యలపై ఉన్నతాధికారులు సమీక్షా సమావేశం నిర్వహించారు.
b427b6f336e774ab179a524c06b47bfd_1955372287.jpg


హైదరాబాద్ , 13 అక్టోబర్ (హి.స.)కొత్తగూడెం సింగరేణి ప్రధాన కార్యాలయం వేదికగా బొగ్గు ఉత్పత్తి లక్ష్యాలు, కొత్త ఓపెన్ కాస్ట్ (ఓసిపి) గనుల విస్తరణ మరియు కార్మికుల రక్షణ చర్యలపై ఉన్నతాధికారులు సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రసుత ఆర్థిక సంవత్సరానికి నిర్దేశించుకున్న ఉత్పత్తి మైలురాళ్లను చేరుకునేందుకు మైనింగ్ విభాగాలకు దిశానిర్దేశం చేశారు.

దీంతోపాటు కార్మికులకు చెల్లించాల్సిన దీపావళి బోనస్ (పిఎల్ఆర్ఐ), కారుణ్య నియామకాల వేగం, గనుల్లో ఆధునిక రక్షణ పరికరాల వాడకంపై కార్మిక సంఘాల ప్రతినిధులతో సమాలోచనలు జరిపారు. కొత్త బొగ్గు బ్లాకుల వేలంలో పాల్గొనడం, హరిత విద్యుత్ ఉత్పత్తిలో భాగంగా సోలార్ ప్లాంట్ల సామర్థ్యాన్ని పెంచే దిశగా సింగరేణి చర్యలు తీసుకుంటోందని అధికారులు వెల్లడించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande