కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ని కలిసిన రాష్ట్ర మంత్రులు
న్యూఢిల్లీ పార్లమెంట్ స్ట్రీట్ లోనీ ట్రాన్స్పోర్ట్ భవనంలో కేంద్ర మంత్రి నితీన్ జైరాం గడ్కర్ ని రాష్ట్ర మంత్రులు మంగళవారం కలిశారు.
Gadkari


న్యూఢిల్లీ, 13 అక్టోబర్ (హి.స) న్యూఢిల్లీ పార్లమెంట్ స్ట్రీట్ లోనీ ట్రాన్స్పోర్ట్ భవనంలో కేంద్ర మంత్రి నితీన్ జైరాం గడ్కర్ ని రాష్ట్ర మంత్రులు మంగళవారం కలిశారు. రాష్ట్ర ఎక్సైజ్ పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎంపీ డాక్టర్ మల్లు రవి కేంద్ర రోడ్డు రవాణా జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ జైరాం గడ్కర్ని కలిశారు. ఈ సందర్భంగా నూతన రహదారులతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా నది పై సోమశిల- సిద్దేశ్వరం ఐకానిక్ వంతెన నిర్మాణానికి సంబంధించి శంకుస్థాపన కార్యక్రమానికి కేంద్ర మంత్రి నితీన్ జైరాం గడ్కర్ని ఆహ్వానించారు. నూతనంగా 225 కిలోమీటర్ల హైవేను కోరుతూ.. వారు వినతిపత్రం అందజేశారు. పుల్లూరు ( NH 44) అల్లంపూర్, జటప్రోలు, పెంట్లవెల్లి, కొల్లాపూర్, లింగాల, అచ్చంపేట, డిండి (NH 765) దేవరకొండను (NH167) కొండ మల్లేపల్లి _నల్లగొండ ( NH525) ను కలుపుతూ.. 225 కిలోమీటర్ల మేర నూతన హైవేను మంజూరును కోరుతూ మంత్రులు వినతి పత్రాన్ని అందజేశారు. అలాగే రాయచూర్, నుంచి పెబ్బేర్, కొల్లాపూర్ మీదుగా లింగాల వరకు ఉన్న రహదారిని జాతీయ రహదారిగా మార్చాలని రాష్ట్ర మంత్రులు కోరుతూ కేంద్రమంత్రికి వినతి పత్రాన్ని అందజేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande