
హైదరాబాద్ , 13 అక్టోబర్ (హి.స.)తెలంగాణ వ్యాప్తంగా ఈశాన్య రుతుపవనాల ప్రభావం, బంగాళాఖాతంలోర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా రాబోయే మూడు రోజుల పాటు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం మరియు నల్గొండ జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే సూచనలు ఉన్నాయి.
పండుగ సమయం కావడం మరియు పత్తి, వరి పంటలు కోత దశకు చేరుకోవడంతో వర్ష సూచనపై రైతాంగం ఆందోళన చెందుతోంది. కోసిన ధాన్యాన్ని కళ్లాల్లో తడవకుండా జాగ్రత్తలు తీసుకోవాలని వ్యవసాయ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. వర్షాల వల్ల విద్యుత్ సరఫరాకు ఆటంకం కలగకుండా విద్యుత్ శాఖ సిబ్బంది అప్రమత్తంగా ఉన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్