

హైదరాబాద్ , 13 అక్టోబర్ (హి.స.)దసరా, బతుకమ్మ పండుగల వేళ జిల్లాలకు వెళ్లే ప్రయాణికులతో బస్టాండ్లు నిండిపోతున్న తరుణంలో, తెలంగాణ రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్ఆర్టీసీ) ప్రత్యేక సమీక్ష నిర్వహించింది. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 'మహాలక్ష్మి' ఉచిత బస్సు ప్రయాణ పథకం కింద దసరా ప్రత్యేక బస్సులలో కూడా మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం యథావిధిగా వర్తిస్తుందని ఆర్టీసీ యాజమాన్యం స్పష్టం చేసింది.
పండుగ దృష్ట్యా రాష్ట్రవ్యాప్తంగా వేలాది ప్రత్యేక సర్వీసులను ఆర్టీసీ అందుబాటులోకి తెచ్చింది. కేవలం గత కొన్ని రోజుల్లోనే కోటిన్నరకు పైగా ప్రయాణాలు నమోదవ్వడం, అందులో మహిళల వాటా అధికంగా ఉండటంతో తీవ్ర రద్దీ ఉన్న మార్గాలలో అదనపు ట్రిప్పులు వేయాలని ఎండీ అధికారులను ఆదేశించారు. హైదరాబాద్, కరీంనగర్, వరంగల్ వంటి ప్రధాన డిపోల నుంచి ప్రయాణికులు ఇబ్బంది పడకుండా సర్వీసులను పర్యవేక్షిస్తున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్