రేపే తెలంగాణ పూల పండుగ.. ట్యాంకుబండు పై భారీ ఏర్పాట్లు
తెలంగాణ పూల పండుగ బతుకమ్మ ను ట్యాంక్ బండ్ పై వైభవంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.
Bathukamma


హైదరాబాద్, 17 అక్టోబర్ (హి.స.)

తెలంగాణ పూల పండుగ బతుకమ్మ ను ట్యాంక్ బండ్ పై వైభవంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఆడపడుచుల ఆత్మగౌరవానికి, ప్రకృతి ఆరాధనకు ప్రతిబింబంగా నిలిచే ఈ వేడుకలో భారీ సంఖ్యలో మహిళలు, కళాకారులు, ప్రజలు భాగస్వాములయ్యేలా ప్రణాళిక రూపొందిస్తోంది.

ఈ వేడుకలకు రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్ల, ప్రముఖ సినీనటుడు విజయ్ దేవరకొండ, రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు. హైదరాబాద్‌లోని హుస్సేన్‌సాగర్ పరిసరాలు, ట్యాంక్‌బండ్ ప్రాంతం బతుకమ్మ వేడుకలతో పండుగ శోభను సంతరించుకోనున్నాయి.

రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన మహిళా బృందాలు, సాంస్కృతిక కళాకారులు, జానపద కళా బృందాల ప్రదర్శనలతో తెలంగాణ కళా వైభవాన్ని చాటేలా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. సంప్రదాయ బతుకమ్మ పాటలతో పాటు తెలంగాణ జానపద సంగీతం, నృత్య ప్రదర్శనలు వేడుకలకు మరింత కళాత్మక శోభను తీసుకురానున్నాయి. నగర ప్రజలతో పాటు వివిధ ప్రాంతాల నుంచి వచ్చే సందర్శకులు ఈ సంబురాల్లో భాగస్వాములయ్యేలా ఏర్పాట్లు చేయడం ద్వారా ట్యాంక్‌బండ్ ప్రాంతం తెలంగాణ సాంస్కృతిక వైభవానికి వేదికగా నిలవనుంది.

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande