తెలంగాణలో ఉరుములు, మెరుపులతో కూడిన వానలు
రాష్ట్రంలో నేడు రేపు పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.
Rain


హైదరాబాద్ , 18 అక్టోబర్ (హి.స.)రాష్ట్రంలో నేడు రేపు పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తాంధ్ర మీదుగా ఏర్పడిన ఉపరితల ఆవర్తనం దక్షిణ కోస్తాంధ్ర నుంచి వాయువ్య బంగాళాఖాతం వరకు ఏర్పడిన ద్రోణి కారణంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది.

ఉమ్మడి వరంగల్, రంగారెడ్డి, నల్గొండ, ఖమ్మం, మహబూబ్నగర్, హైదరాబాద్, కరీంనగర్ జిల్లాల్లో అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశం ఉందని స్పష్టం చేసింది. ఇక, మంగళవారం, బుధవారాల్లో కూడా పలు జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు తెలిపింది. మరోవైపు, శనివారం భద్రాద్రి కొత్తగూడెం, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి తదితర జిల్లాల్లో అక్కడక్కడా మోస్తరు వర్షాలు కురిశాయి.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande