పులివెందులలో పోలీసులు భద్రతను కట్టుదిట్టం
వైఎస్సార్ కడప జిల్లా పులివెందులలో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. గత రెండు రోజులుగా నామినేషన్ల దాఖలు సందర్భంగా చోటుచేసుకున్న ఉద్రిక్తతలు, రాజకీయ పార్టీల కార్యకర్తల మధ్య ఘర్షణల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టారు.
Ap police


అమరావతి , 18 అక్టోబర్ (హి.స.)వైఎస్సార్ కడప జిల్లా పులివెందులలో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. గత రెండు రోజులుగా నామినేషన్ల దాఖలు సందర్భంగా చోటుచేసుకున్న ఉద్రిక్తతలు, రాజకీయ పార్టీల కార్యకర్తల మధ్య ఘర్షణల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టారు. ముఖ్యంగా మున్సిపల్ కార్యాలయం, నామినేషన్ల స్వీకరణ కేంద్రం పరిసరాల్లో పోలీసుల నిఘాను పెంచారు. అభ్యర్థులు, వారి అనుచరులు నిబంధనలకు అనుగుణంగా వ్యవహరించేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. అక్టోబర్ 18 నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ కావడంతో రాజకీయ పార్టీలకు చెందిన అభ్యర్థులు, నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉండటంతో భద్రతకు ప్రాధాన్యం ఇచ్చారు.

శనివారం నామినేషన్ల ప్రక్రియ సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. నామినేషన్ కేంద్రం వద్ద తెలుగుదేశం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన అభ్యర్థులు, కార్యకర్తలు ఒకేసారి చేరుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారినట్లు వార్తలు వెలువడ్డాయి. అభ్యర్థులు, వారి అనుచరులను కేంద్రంలోకి అనుమతించే విషయంలో నెలకొన్న వివాదం క్రమంగా తీవ్రరూపం దాల్చింది. కొంతమంది కార్యకర్తలు గుంపుగా ముందుకు వెళ్లేందుకు ప్రయత్నించడంతో పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande