
భూపాలపల్లి, 17 అక్టోబర్ (హి.స.)
ప్రజల భద్రత, సౌకర్యవంతమైన ప్రయాణమే లక్ష్యంగా అభివృద్ధి పనులను నాణ్యతా ప్రమాణాలతో నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు.
శనివారం జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మతో కలిసి పట్టణంలోని అంబేద్కర్ కూడలి అభివృద్ధి నమూనాను పరిశీలించిన ఎమ్మెల్యే.. పలు ప్రాంతాల్లో చేపట్టనున్న రోడ్ల విస్తరణ పనులపై ప్రజాప్రతినిధులు, అధికారులతో క్షేత్రస్థాయిలో సమీక్షించారు.
భూపాలపల్లి పట్టణంలో పెరుగుతున్న జనాభా, వాహనాల రద్దీకి అనుగుణంగా రోడ్ల విస్తరణ, మౌలిక వసతుల అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు. పట్టణంలో రోడ్ల విస్తరణకు రూ.70 కోట్లు, మౌలిక వసతుల అభివృద్ధికి అమృత్ పథకం కింద రూ.23 కోట్లు మంజూరైనట్లు ఎమ్మెల్యే తెలిపారు.
రోడ్ల విస్తరణ పనులను వేగవంతం చేయాలని సూచించారు. వాహనాల రాకపోకలు పెరుగుతున్న నేపథ్యంలో ట్రాఫిక్ సమస్యలు, ప్రమాదాలను నివారించేందుకు రహదారుల విస్తరణ అత్యవసరమని పేర్కొన్నారు.
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..