టౌన్ ప్లానింగ్ అధికారులపై తిరగపడ్డ స్థానికులు
శంషాబాద్ లోని మధుర నగర్ లో శనివారం ఉదయం తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. మధుర నగర్ లో ఎలాంటి అనుమతులు లేకుండా త్రిబుల్ వన్ జీవో పరిధిలో ఇష్టారాజ్యంగా నిర్మించిన భవనాలను కూల్చివేసేందుకు కొన్ని రోజుల క్రితం టౌన్ ప్లానింగ్ టీపీఎస్ సంతోష్ నోటీసులు జారీ చేశారు.
Shamshabad

హైదరాబాద్, 17 అక్టోబర్ (హి.స.)

శంషాబాద్ లోని మధుర నగర్ లో శనివారం ఉదయం తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. మధుర నగర్ లో ఎలాంటి అనుమతులు లేకుండా త్రిబుల్ వన్ జీవో పరిధిలో ఇష్టారాజ్యంగా నిర్మించిన భవనాలను కూల్చివేసేందుకు కొన్ని రోజుల క్రితం టౌన్ ప్లానింగ్ టీపీఎస్ సంతోష్ నోటీసులు జారీ చేశారు.

కాగా ఈరోజు ఉదయం భారీ పోలీసు బందోబస్తు మధ్య యంత్రాలతో నిర్మాణాలను కూల్చివేసేందుకు వెళ్లారు. పనులు ప్రారంభించగానే స్థానిక నాయకులు బాధితులు, స్థానికులు పెద్ద ఎత్తున అధికారులతో వాగ్వాదానికి దిగారు.నేడు అక్రమ నిర్మాణాల కూల్చివేతకు వెళ్లిన టౌన్ ప్లానింగ్ అధికారులను అడ్డుకున్నారు.

పనులను అడ్డుకొని వారిపై దౌర్జన్యానికి తెగబడ్డారు. అధికారులను తీవ్రమైన పదజాలంతో దూషించారు. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్న పోలీసులు కూడా ఏమీ చేయలేని పరిస్థితి నెలకొంది. చివరకు టౌన్ ప్లానింగ్ సిబ్బంది అక్కడి నుంచి పనులు ఆపేసి వెనుదిరిగారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు

 rajesh pande