మేయర్, మున్సిపల్ ఛైర్మన్ అభ్యర్థుల తొలి జాబితా విడుదల చేసిన జనసేన
స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో జనసేన పార్టీ తొలి జాబితాను విడుదల చేసింది. మేయర్, మున్సిపల్ ఛైర్మన్ అభ్యర్థుల తొలి జాబితాను వెల్లడించింది.
Janasena


అమరావతి, అక్టోబర్ 17 ( హి స ) స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో జనసేన పార్టీ తొలి జాబితాను విడుదల చేసింది. మేయర్, మున్సిపల్ ఛైర్మన్ అభ్యర్థుల తొలి జాబితాను వెల్లడించింది.

వివరాల్లోకి వెళితే....విజయవాడ మేయర్ జనసేన అభ్యర్థిగా వంగవీటి రాధాకృష్ణ, ఏలూరు మేయర్ జనసేన అభ్యర్థిగా రెడ్డి అప్పలనాయుడు, అమలాపురం మున్సిపల్ ఛైర్మన్ జనసేన అభ్యర్థిగా నల్లా శ్రీధర్, చిలకలూరిపేట మున్సిపల్ ఛైర్మన్ జనసేన అభ్యర్థిగా తోట రాజేశ్వరి, గొల్లప్రోలు మున్సిపల్ ఛైర్మన్ జనసేన అభ్యర్థిగా కడారి తమ్మయ్యనాయుడు, నరసాపురం మున్సిపల్ ఛైర్మన్ జనసేన అభ్యర్థిగా కొత్తపల్లి శైలజ, నిడదవోలు మున్సిపల్ ఛైర్మన్ జనసేన అభ్యర్థిగా కల్లం జ్యోతి, పెడన మున్సిపల్ ఛైర్మన్ జనసేన అభ్యర్థిగా మట్టా శివపావని, పిఠాపురం మున్సిపల్ ఛైర్మన్ జనసేన అభ్యర్థిగా బీరా విజయ్శేఖర్, పుత్తూరు మున్సిపల్ ఛైర్మన్ జనసేన అభ్యర్థిగా డి.ఏలుమలై, సాలూరు మున్సిపల్ ఛైర్మన్ జనసేన అభ్యర్థిగా గొర్లె విజయకుమారి, సామర్లకోట మున్సిపల్ ఛైర్మన్ జనసేన అభ్యర్థిగా పిట్టా జానకి రామారావు, తెనాలి మున్సిపల్ ఛైర్మన్ జనసేన అభ్యర్థిగా టి.వెంకటరమణారావు, తిరువూరు మున్సిపల్ ఛైర్మన్ జనసేన అభ్యర్థిగా పి.మాధవిని జనసేన పార్టీ ప్రకటించింది.

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande