
నిర్మల్, 17 అక్టోబర్ (హి.స.)
ఎల్నినో ప్రభావం వల్ల ప్రజలు ఇబ్బందులు పడకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జుపటేల్ అన్నారు.
ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ ఎంపీడీఓ కార్యాలయంలో శనివారం వారు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కరువు పరిస్థితుల ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు ముందు జాగ్రత్తలు తీసుకునేలా ప్రతి ఒక్కరు సమష్టిగా కృషి చేయాలని, నీటి వసతులను పెంచుకోవడానికి గాను ప్రతి ఒక్కరు ఇంటింటికి ఇంకుడు గుంతలు నిర్మించుకోవాలని దీనితో మన వాడుకునే నీటిని ఇంకుడు గుంతల్లో చేరే విధంగా చూడాలని అన్నారు.
చెట్ల వల్ల వర్షాలు కురుస్తూ ఎలినినో ప్రభావం తలెత్తకుండా చూడచ్చని అందుకనే ప్రతి ఇంటికి విరివిగా మొక్కలను నాటాలని ఎమ్మెల్యే పటేల్ అన్నారు.
ఈ ఏడాది నీటి కొరత ప్రభావం తీవ్రంగా ఏర్పడే పరిస్థితులు ఉన్నాయని ప్రభుత్వం ముందుగానే గమనించి అవగాహన కార్యక్రమాలు నిర్వహించిందని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..