వైఎస్సార్సీపీ ఛైర్మన్ అభ్యర్థి ఇంట్లో మద్యం పట్టివేత
వైఎస్సార్సీపీ తరఫున ఛైర్మన్ అభ్యర్థిగా పోటీ చేసేందుకు ఎంపికైన కొప్పుల రవి ఇంట్లో తెలంగాణ మద్యం 429 సీసాలను పోలీసులు పట్టుకున్నారు.
Liquor


అమరావతి , 17 అక్టోబర్ (హి.స.)స్థానిక సంస్థల ఎన్నికల్లో దాచేపల్లి నగర పంచాయతీ నుంచి వైఎస్సార్సీపీ తరఫున ఛైర్మన్ అభ్యర్థిగా పోటీ చేసేందుకు ఎంపికైన కొప్పుల రవి ఇంట్లో తెలంగాణ మద్యం 429 సీసాలను పోలీసులు పట్టుకున్నారు. ఈ మేరకు పోలీసులు ఆయన్ను అరెస్టు చేశారు. ఛైర్మన్ పదవికి నామినేషన్ దాఖలు చేసే రోజు పంపిణీ చేయడానికి రవి అనుచరుడు బుర్రి అనిల్తో పాటు మరికొందరు తెలంగాణ నుంచి అక్రమంగా మద్యం తీసుకొచ్చినట్లు పోలీసులకు సమాచారం అందింది. ఈ మేరకు ఎస్సై ఖాసింవలి రవి నివాసంలో తనిఖీలు చేపట్టగా, రూ.64,640 విలువైన 429 మద్యం సీసాలు దొరికాయి. కేసు నమోదు చేసిన పోలీసులు రవి, అనిల్లను అరెస్ట్ చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande