ఖమ్మం జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు దుర్మరణం
ఖమ్మం జిల్లాలో గత రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే దుర్మరణం చెందారు.
Accident


ఖమ్మం, 17 అక్టోబర్ (హి.స.)

ఖమ్మం జిల్లాలో గత రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. జిల్లాలోని వైరా మండలం సోమవరం గ్రామం గ్రీన్ ఫీల్డ్ హైవే ఎగ్జిట్ సమీపంలో శుక్రవారం అర్ధరాత్రి సమయంలో బొలెరో వాహనాన్ని వెనకనుంచి లారీ ఢీ కొట్టడంతో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. ప్రమాదంలో మరో నలుగురు వ్యక్తులకు గాయాలయ్యాయి. బొలెరో వాహనం దేవరపల్లి నుంచి భువనగిరి వెళ్తుండగా వెనకనుంచి వస్తున్న లారీ అతివేగంగా ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో బొలెరో వాహనం పల్టీ కొట్టడంతో అందులోని మల్లేశ్, ఉపేందర్ అనే వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని అంబులెన్లో ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రమాద సంఘటనపై కేసు నమోదు చేసుకున్నట్టు పోలీసులు చెప్పారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande