నేడు రాయచోటిలో మరోసారి ఉద్రిక్తత
అన్నమయ్య జిల్లా రాయచోటిలో నేడు మరోసారి ఉద్రిక్తత నెలకొంది. మదనపల్లి రోడ్డులోని ఓ లాడ్జిలో వైఎస్సార్సీపీ కార్యకర్తలు, కర్ణాటక నుంచి వచ్చినవారు, బౌన్సర్లు మకాం వేసినట్లు సమాచారం అందడంతో తెలుగుదేశం కార్యకర్తలు అక్కడికి పెద్ద సంఖ్యలో చేరుకున్నారు.
Police


అమరావతి , 17 అక్టోబర్ (హి.స.)అన్నమయ్య జిల్లా రాయచోటిలో నేడు మరోసారి ఉద్రిక్తత నెలకొంది. మదనపల్లి రోడ్డులోని ఓ లాడ్జిలో వైఎస్సార్సీపీ కార్యకర్తలు, కర్ణాటక నుంచి వచ్చినవారు, బౌన్సర్లు మకాం వేసినట్లు సమాచారం అందడంతో తెలుగుదేశం కార్యకర్తలు అక్కడికి పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. దీంతో లాడ్జి పరిసరాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వైఎస్సార్సీపీ, తెలుగుదేశం వర్గాలు పరస్పరం ఘర్షణకు దిగారు. ఘర్షణల్లో అక్కడే ఉన్న ఓ కారు ధ్వంసమైంది. పోలీసులు లాడ్జి వద్దకు చేరుకొని వైఎస్సార్సీపీ శ్రేణులు సహా కర్ణాటక వ్యక్తులు, బౌన్సర్లను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద మారణాయుధాలు ఉన్నట్లు గుర్తించారు. వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు, పెద్ద సంఖ్యలో పోలీసులు నామినేషన్ కేంద్రాల వద్ద మూడంచెల భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేశారు. రాయచోటిలో ర్యాలీలు, ఆందోళనలను పోలీసులు నిషేధించారు. అదనపు ఎస్పీ వెంకటాద్రి పట్టణంలో పర్యటిస్తూ పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande