
హైదరాబాద్, 17 అక్టోబర్ (హి.స.)
ఎలక్షన్ కమిషన్ నిర్వహిస్తున్న 'స్పెషల్ఇంటెన్సివ్ రివిజన్' (SIR) ప్రక్రియ విధానంలో పారదర్శకత లోపించిందని, స్వయంగా తనకు కూడా నోటీసు వచ్చిందని టిపిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు.
శనివారం గాంధీ భవన్లో మీడియాతో మాట్లాడిన ఆయన, ఎన్నికల వ్యవస్థలో అవలంబించాల్సిన ప్రాథమిక నిబంధనలను విస్మరిస్తున్నారని ఆరోపించారు.
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి నచ్చని ఓట్లను ఏకపక్షంగా తోలిగించే కుట్ర జరుగుతోంది' అని విమర్శించారు. ఎస్ ఐ ఆర్ లో తీవ్ర లోపాలు ఉన్నాయని మహేష్ కుమార్ గౌడ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఇన్నాళ్లూ ఈడీ, సీబీఐ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలను రాజకీయ ప్రత్యర్థులపై ప్రయోగించిన బీజేపీ, ఇప్పుడు కేంద్ర ఎన్నికల సంఘాన్ని కూడా తన రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటోందని ఆరోపించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..