
హైదరాబాద్, 19 అక్టోబర్ (హి.స.) రాష్టంలో కరువు పరిస్థితులపై కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను చైర్మన్ గా మరో ఐదుగురు మంత్రులతో కూడిన కమిటీని ఏర్పాటు చేస్తూ సోమవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు ఉత్తర్వులు జారీ చేశారు.
ఈ కమిటీలో సభ్యులుగా మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, సీతక్క, వాకిటి శ్రీహరి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి లను నియమించింది. మరియు వీరితోపాటు
ముఖ్యమంత్రి సలహాదారు కే.రామకృష్ణారావు ఈ కమిటీలో ప్రత్యేక ఆహ్వానితుడిగా వ్యవహరిస్తూ, ఎప్పటికప్పుడు పరిస్థితులపై సమన్వయం నిర్వహిస్తారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
ప్రణాళికా శాఖ కార్యదర్శి ఈ కమిటీకి కన్వీనర్‌గా వ్యవహరించనున్నారు. ఈ కేబినెట్ సబ్‌కమిటీ రాష్ట్రంలోని కరువు, ఎల్‌నినో పరిస్థితులను నిరంతరం పర్యవేక్షిస్తూ, సంబంధిత శాఖలకు మార్గదర్శకాలు జారీ చేస్తుంది.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు