
హైదరాబాద్, 19 అక్టోబర్ (హి.స.)
ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టులో నేడు మరో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. ఫ్యూచర్ సిటీ పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణ కోసం ఇబ్రహీంపట్నంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్‌ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో DGP సీవీ ఆనంద్, ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషితో పాటు పలువురు ఉన్నతాధికారులు మరియు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఫ్యూచర్ సిటీ భవిష్యత్ అవసరాలు, పారిశ్రామిక, నివాస ప్రాంతాల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ కొత్త కమిషనరేట్‌ను తీర్చిదిద్దినట్లు అధికారులు వెల్లడించారు
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు