
పెద్దపల్లి, 19 అక్టోబర్ (హి.స.)
గ్రామాల్లో మౌళిక వసతుల కల్పనకు పెద్దపీట వేస్తున్నట్లు పెద్దపల్లి ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రభుత్వ విప్,విజయ రమణారావు తెలిపారు.
పెద్దపల్లి మండలం రాఘవపూర్ గ్రామపంచాయితీ పరిది గొల్లపల్లిలో రూ 10 లక్షలతో నిర్మించనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులకు సోమవారం ఆయన శంఖుస్థాపన చేసి పనులు ప్రారంభించారు.
ఈ సందర్భంగా విజయ రమణారావు మాట్లాడుతూ గ్రామాల్లో మౌళిక వసతుల కల్పనలో భాగంగా రహదారుల అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తున్న నేపథ్యంలో సీసీ రోడ్డు నిర్మాణానికి నిధులు కేటాయించామన్నారు.
ఈ రోడ్డు నిర్మాణం పూర్తయితే గ్రామ ప్రజలకు రాకపోకల్లో మరింత సౌలభ్యం కలగనుందని చెప్పారు. స్థానిక అవసరాలకు అనుగుణంగా రహదారి సదుపాయాలు మెరుగు పడనున్నాయని వివరించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు