దుర్గామాత ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలి.. బండి సంజయ్
కరీంనగర్ లోని శ్రీ మహా శక్తి దేవాలయంలో సోమవారం దేవీ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శ్రీ రుద్ర సహిత చండీ హోమం వైభవంగా నిర్వహించారు.
బండి సంజయ్


కరీంనగర్, 19 అక్టోబర్ (హి.స.)

కరీంనగర్ లోని శ్రీ మహా శక్తి దేవాలయంలో సోమవారం దేవీ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శ్రీ రుద్ర సహిత చండీ హోమం వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఛండీ హోమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దుర్గామాత ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని, దేశ సుభిక్షంగా ఉండాలని కోరుకున్నట్లు ఆయన తెలిపారు. అందరికీ విజయదశమి శుభాకాంక్షలు కూడా తెలిపారు. ప్రతిసంవత్సరం కూడా బండిసంజయ్ దుర్గాదీక్ష తీసుకుని మహాశక్తి ఆలయంలో పూజలను నిర్వహిస్తుంటారు. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా దీక్ష తీసుకుని దుర్గా పూజలలో గత తొమ్మిది రోజులుగా పాల్గొంటున్నారు. అలాగే భక్తులు కూడా పెద్ద సంఖ్యలో తరలి వచ్చి ఛండీ హోమం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande