పేషెంట్లకు మెరుగైన వైద్య సేవలు అందించాలి.. కలెక్టర్ చాహత్ బాజ్ పాయి
పేషెంట్లకు అందించే వైద్య సేవల నిర్వహణ మెరుగ్గా ఉండాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి ఆదేశించారు.
Collector


వరంగల్, 19 అక్టోబర్ (హి.స.)

పేషెంట్లకు అందించే వైద్య సేవల నిర్వహణ మెరుగ్గా ఉండాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి ఆదేశించారు.

సోమవారం హనుమకొండ ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రి ప్రాంగణంలో ఉన్న వెల్ నెస్ సెంటర్ ను జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.

వెల్ నెస్ సెంటర్ లోని డెంటల్, గైనిక్, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, ఈఎన్టీ, ఫార్మసీ స్టోర్, ఫార్మసీ, ల్యాబ్, తదితర విభాగాలను కలెక్టర్ పరిశీలించి అక్కడ పేషంట్లకు అందుతున్న వైద్య సేవలను మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సుస్మితను అడిగి తెలుసుకున్నారు.

ఆయా విభాగాలలో ఓపి చూస్తున్న వైద్యులతో కలెక్టర్ మాట్లాడారు. ఓపి సేవల నిమిత్తం వస్తున్న వారి సంఖ్య గణనీయంగా పెరిగిందని డాక్టర్ సుస్మిత జిల్లా కలెక్టర్ కు వివరించారు.

వైద్యులు సిబ్బంది హాజరు పట్టికను కలెక్టర్ తనిఖీ చేశారు. ప్రాంగణంలో ఉన్న టాయిలెట్స్ ను పరిశీలించారు. ఓపి సేవల కోసం వచ్చిన పేషంట్ల వివరాలు నమోదు చేస్తున్న విధానం, ఫార్మసీలో పేషెంట్లకు మందులను ఏ విధంగా అందిస్తున్నారనేది జిల్లా కలెక్టర్ పరిశీలించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande