
ఆదిలాబాద్, 19 అక్టోబర్ (హి.స.)
అదిలాబాద్ జిల్లా ఉట్నూర్ లోని ప్రభుత్వ ఆస్పత్రిని ఖానాపూర్ ఎమ్మెల్యే, ఉట్నూర్ ఆసుపత్రి చైర్మన్ వెడ్మ బొజ్జుపటేల్ సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.
అన్ని గదులు తిరిగి అందుతున్న వైద్య సేవల గురించి ఎమ్మెల్యే డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు.
అనంతరం వైద్య అధికారులు, ఉద్యోగులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
నిరుపేదలకు మెరుగైన వైద్య సేవలు అందించాలన్నదే తన లక్ష్యమని వైద్యాధికారులు వైద్య ఉద్యోగులు నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండి వైద్య సేవలు అందించాలని ఎమ్మెల్యే కోరారు.
ఆస్పత్రి సూపర్డెంట్ ఉపేందర్ జాదవ్ ఆస్పత్రి ద్వారా అందుతున్న వైద్య సేవలు సౌకర్యాలు గురించి కావలసిన సౌకర్యాల గురించి ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..