రెవెన్యూ శాఖ ఉన్నతాధికారులతో మంత్రి పొంగులేటి సమీక్ష
గత బిఆర్ఎస్ ప్రభుత్వ పెద్దల నిర్లక్ష్యం, స్వార్థపూరిత నిర్ణయాల వల్ల రెవెన్యూ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారిందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి విమర్శించారు.
Minister


హైదరాబాద్, 19 అక్టోబర్ (హి.స.)

గత బిఆర్ఎస్ ప్రభుత్వ పెద్దల నిర్లక్ష్యం, స్వార్థపూరిత నిర్ణయాల వల్ల రెవెన్యూ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారిందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి విమర్శించారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచనలు, సలహాల మేరకు రెవెన్యూ వ్యవస్థను బలోపేతం చేస్తూ ప్రజలకు మరింత చేరువ చేస్తున్నామని వారు పేర్కొన్నారు.

సోమవారం సచివాలయంలో రెవెన్యూ శాఖ ఉన్నతాధికారులతో మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ..

రైతులకు చట్టబద్ధమైన భూ హక్కులు కల్పించడం, భూవివాదాలకు శాశ్వత పరిష్కారం చూపడం లక్ష్యంగా రెవెన్యూ వ్యవస్థను పునర్నిర్మిస్తున్నామని తెలిపారు.

భూభారతి చట్టం అమలు, రైతులకు పట్టాదారు పాస్బుక్కుల పంపిణీ, రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన భూముల రీ-సర్వే, భూ సమస్యల పరిష్కారం, ఇటీవల తీసుకున్న కీలక నిర్ణయాల అమలుపై సమీక్షించారు. తెలంగాణ రాష్ట్రంలో భూవివాదాలు లేని పరిస్థితిని తీసుకురావాలనే సంకల్పంతో చారిత్రాత్మక భూభారతి చట్టాన్ని తీసుకొచ్చామని మంత్రి తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande