ప్రజల ధన, మాన, ప్రాణ రక్షణే పోలీస్ శాఖ ప్రధాన లక్ష్యం.....ములుగు జిల్లా ఎస్పీ
దసరా పండుగను పురస్కరించుకొని ములుగు జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ ఐపీఎస్ ఆధ్వర్యంలో సోమవారం ఆయుధ పూజ కార్యక్రమాన్ని సంప్రదాయబద్ధంగా నిర్వహించారు.
Sp


ములుగు, 19 అక్టోబర్ (హి.స.) దసరా పండుగను పురస్కరించుకొని ములుగు జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ ఐపీఎస్ ఆధ్వర్యంలో సోమవారం ఆయుధ పూజ కార్యక్రమాన్ని సంప్రదాయబద్ధంగా నిర్వహించారు.

పోలీస్ శాఖ విధి నిర్వహణలో ఉపయోగించే ఆయుధాలు, పోలీసు వాహనాలకు ప్రత్యేక పూజలు చేశారు. ప్రజల రక్షణ, శాంతిభద్రతల పరిరక్షణలో నిరంతరం సేవలందించే పోలీసు సిబ్బంది క్షేమంగా ఉండాలని, జిల్లా ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని ప్రార్థించారు.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ, ప్రజల ధన, మాన, ప్రాణ రక్షణే పోలీస్ శాఖ ప్రధాన లక్ష్యమని, శాంతిభద్రతల పరిరక్షణతో పాటు ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు పోలీసు సిబ్బంది నిరంతరం కృషి చేయాలని సూచించారు.

పండుగల సమయంలో ప్రజలు ప్రశాంతమైన వాతావరణంలో వేడుకలు జరుపుకునేలా పోలీస్ శాఖ అప్రమత్తంగా ఉంటుందని తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande