జిల్లాలలో బోసిపోయిన ప్రజావాణి
తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాలు నేడు బోసిపోయి కనిపించాయి.
Prajavani


ఖమ్మం, 19 అక్టోబర్ (హి.స.) తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాలు నేడు బోసిపోయి కనిపించాయి.

దసరా పండుగ నేపథ్యంలో ప్రజావాణి కార్యక్రమానికి దరఖాస్తుదారులు పెద్దగా రాకపోవడంతో సంబంధిత కార్యాలయాల ప్రాంగణాలు ఖాళీగా కనిపించడం విశేషం.

వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు తమ సమస్యలను జిల్లా కలెక్టర్, సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణికి పెద్ద సంఖ్యలో తరలివస్తుంటారు. తమ సమస్యల పరిష్కారం కోసం వినతిపత్రాలు సమర్పిస్తుంటారు. అయితే దసరా పండుగ నేపథ్యంలో ఈసారి ప్రజావాణికి స్పందన తక్కువగా కనిపించింది. సాధారణంగా ప్రజలతో నిండిపోయే వేచి ఉండే ప్రదేశంలోని కుర్చీలు సైతం చాలావరకు ఖాళీగా దర్శనమిచ్చాయి.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande