
హైదరాబాద్, 19 అక్టోబర్ (హి.స.) హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో వివిధ పోలీస్ స్టేషన్లలో పనిచేస్తున్న 75 మంది ఎస్సైలను బదిలీ చేస్తూ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.
నగరంలో శాంతిభద్రతల నిర్వహణను మరింత కట్టుదిట్టం చేసేందుకు, అలాగే సుదీర్ఘకాలంగా ఒకేచోట విధులు నిర్వహిస్తున్న వారిని వేర్వేరు స్టేషన్లు, విభాగాలు, లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్, క్రైమ్ విభాగాలు, కంట్రోల్ రూమ్లకు బదిలీ చేస్తూ ఈ నిర్ణయం తీసుకున్నారు.
శాంతిభద్రతల పరిరక్షణ, అడ్మినిస్ట్రేటివ్ పనితీరును మరింత వేగవంతం చేయడంలో భాగంగా బదిలీలు జరిగినట్టు వారు చెప్పారు. కమిషనరేట్ పరిధిలోని బదిలీ అయిన స్థానాల్లో అధికారులు తక్షణమే బాధ్యతలు స్వీకరించాలని సీపీ సజ్జనార్ స్పష్టం చేశారు. రాబోయే పండుగలు, నగరంలో పెరుగుతున్న రద్దీ, భద్రతా అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ మార్పులు చేసినట్లుగా పోలీస్ వర్గాలు వెల్లడించాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..