
అమరావతి , 30 అక్టోబర్ (హి.స.)
ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా లా కాలేజీల్లో ప్రవేశాల కోసం నిర్వహిస్తున్న AP LAWCET / PGLCET 2026 రెండో విడత (చివరి విడత) కౌన్సెలింగ్లో వెబ్ ఆప్షన్ల నమోదు గడువు ఈరోజుతో (అక్టోబర్ 30) ముగియనుంది. అభ్యర్థులు తమ ప్రాధాన్య కాలేజీలను అధికారిక పోర్టల్లో నమోదు చేసుకోవాలని ఉన్నత విద్యామండలి తెలిపింది. అక్టోబర్ 31న ఆప్షన్ల మార్పునకు (Edit Option) అవకాశం కల్పించి, నవంబర్ 4న సీట్ల కేటాయింపు ఫలితాలను విడుదల చేస్తారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్