
అమరావతి , 30 అక్టోబర్ (హి.స.)
ఆంధ్రప్రదేశ్‌లో పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన ప్రచార పర్వం ముగిసింది. గత కొన్ని రోజులుగా హోరాహోరీగా సాగిన రాజకీయ పార్టీల ప్రచారానికి తెరపడింది. అభ్యర్థులు, ఆయా పార్టీల నాయకులు ఓటర్లను ఆకట్టుకునేందుకు విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ర్యాలీలు, సమావేశాలు, ఇంటింటి ప్రచారాలతో పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల సందడి నెలకొంది. ప్రచార గడువు ముగియడంతో ఇక అభ్యర్థులు పోలింగ్‌పై దృష్టి సారించారు.
నవంబర్ 1వ తేదీన రాష్ట్రంలోని 13 కార్పొరేషన్లు, మున్సిపాలిటీల పరిధిలో ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఎన్నికల సంఘం అవసరమైన ఏర్పాట్లు చేస్తోంది. ఏదైనా ప్రాంతంలో అనుకోని పరిస్థితుల వల్ల పోలింగ్‌కు ఆటంకం ఏర్పడితే, అక్కడ నవంబర్ 2న తిరిగి పోలింగ్ నిర్వహించనున్నారు. అనంతరం నవంబర్ 3వ తేదీన ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను ప్రకటించనున్నారు.
మరోవైపు ఇప్పటికే 17 మున్సిపాలిటీల్లో ఛైర్పర్సన్ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. వీటిలో తెలుగుదేశం పార్టీ 15 స్థానాలను దక్కించుకోగా, జనసేన, బీజేపీ చెరో స్థానంలో విజయం సాధించాయి. దీంతో మిగిలిన స్థానాల్లో ఎలాంటి ఫలితాలు వస్తాయన్న ఉత్కంఠ రాజకీయ వర్గాల్లో నెలకొంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్