
అమరావతి , 30 అక్టోబర్ (హి.స.)
విశాఖపట్నం నగరం 'అర్నాబ్' తుఫాను నుంచి నెమ్మదిగా తేరుకుని సాధారణ స్థితికి చేరుకుంటోంది. తుపాను సమయంలో కూలిపోయిన వందలాది చెట్లు, విద్యుత్ వైర్లను తొలగించి ప్రధాన రహదారుల్లో రాకపోకలను పునరుద్ధరించారు. అయితే తుపాను దాటికి విద్యుత్ షాక్ మరియు చెట్లు కూలిన ఘటనల్లో ముగ్గురు ప్రాణాలు కోల్పోవడం విషాదాన్ని నింపింది. మరోవైపు విశాఖ-భువనేశ్వర్ రైల్వే మార్గంలో రైల్వే వంతెన వద్ద నీటి ఉధృతి తగ్గడంతో నిలిపివేసిన పలు రైలు సర్వీసులను అధికారులు పునరుద్ధరిస్తున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్