
ప్రకాశం , 30 అక్టోబర్ (హి.స.)
ప్రకాశం జిల్లా గుడ్లూరు మండలం పాజర్లలో సెల్ ఫోన్ పేలి ఇల్లు దెబ్బతిన్న ఘటన వెలుగులోకి వచ్చింది. గ్రామానికి చెందిన తిరుమల అనే వ్యక్తి తన మొబైల్ ఫోన్కు ఛార్జింగ్ పెట్టి పనికి వెళ్లాడు. బ్యాటరీ తీవ్రంగా వేడెక్కి ఫోన్ పేలిపోవడంతో ఇంట్లోని వస్తువులకు మంటలు అంటుకుని దగ్ధమయ్యాయి, గోడలకు బీటలు వారాయి. ప్రమాద సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పిందని అధికారులు తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్