సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసుల స్మార్ట్ ప్లాన్ – 7 కి.మీ BRT కారిడార్ తనిఖీ
హైదరాబాద్ ఐటీ కారిడార్లలో నిత్యం ఎదురవుతున్న తీవ్ర ట్రాఫిక్ నివారిచేందుకు సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు మరియు జీహెచ్ఎంసీ అధికారులు ఒక నూతన బృహత్ ప్రణాళికను పరిశీలించారు.
TELANGANA police


హైదరాబాద్ , 30 అక్టోబర్ (హి.స.)హైదరాబాద్ ఐటీ కారిడార్లలో నిత్యం ఎదురవుతున్న తీవ్ర ట్రాఫిక్ నివారిచేందుకు సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు మరియు జీహెచ్ఎంసీ అధికారులు ఒక నూతన బృహత్ ప్రణాళికను పరిశీలించారు. జేఎన్టీయూ (JNTU) జంక్షన్ నుంచి హైటెక్ సిటీ, రాయదుర్గం మెట్రో స్టేషన్ మీదుగా వేవ్రాక్ (Waverock) వరకు ఉన్న 7 కిలోమీటర్ల మార్గంలో ప్రత్యేక 'కౌంటర్ ఫ్లో బస్ రాపిడ్ ట్రాన్సిట్' (BRT) వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు క్షేత్రస్థాయి పరిశీలన జరిపారు.

ఈ ప్రాజెక్ట్ ద్వారా ఐటీ ఉద్యోగులు, సాధారణ ప్రయాణికులు సొంత వాహనాల కంటే ప్రజారవాణా వ్యవస్థ వైపు మళ్లేలా ప్రోత్సహించడం ప్రధాన ఉద్దేశం. ప్రస్తుతం ఈ మార్గంలో పీక్ అవర్స్లో వేలాది వాహనాలు నిలిచిపోవడంతో తీవ్ర ట్రాఫిక్ జామ్లు ఏర్పడుతున్నాయి. బీఆర్టీ విధానం అందుబాటులోకి వస్తే ప్రత్యేక లైన్ల ద్వారా ఆర్టీసీ బస్సులు వేగంగా గమ్యస్థానాలకు చేరుకుంటాయని, దీనివల్ల ప్రయాణ సమయం గణనీయంగా తగ్గుతుందని ట్రాఫిక్ పోలీసులు అంచనా వేస్తున్నారు. ఈ పైలట్ ప్రాజెక్ట్ సాధ్యాసాధ్యాలపై సమగ్ర నివేదిక తయారుచేసి త్వరలోనే పనులు ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande