
హైదరాబాద్, 30 అక్టోబర్ (హి.స.)
వైద్య సేవలకు వచ్చే వారికి నాణ్యమైన చికిత్స అందించే విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి అన్నారు.
హనుమకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలోని సి హెచ్ సి, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఈ సందర్భంగా హాస్పిటల్ కి ప్రతిరోజు ఎంతమంది ఓపి సేవల నిమిత్తం వస్తుంటారని, పేషెంట్ల వివరాలు ఆన్లైన్లో నమోదు చేస్తున్నారా అని వైద్యులు, సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.
వైద్య సేవల నిమిత్తం వచ్చే రోగులకు ఆరోగ్య కేంద్రంలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టాలన్నారు. పేషంట్లకు అవసరమైన అన్ని సదుపాయాలు ఆరోగ్య కేంద్రంలో అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. మందుల నిర్వహణ సరిగ్గా ఉండాలన్నారు. ఆరోగ్య కేంద్రంలోని టీకాల గది, మెడికల్ రికార్డు విభాగం, మెడికల్ స్టోర్ ను తనిఖీ చేశారు. వైద్య సేవలపై ప్రజల్లో నమ్మకం పెంచే విధంగా వైద్యులు, సిబ్బంది బాధ్యతాయుతంగా పనిచేయాలని మేల్, ఫిమేల్ వార్డులను, ఓపి నమోదును కలెక్టర్ పరిశీలించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు