నెల్లూరు జిల్లాలో స్కార్పియో ప్రమాదం – డ్రైవర్ మృతి
నెల్లూరు జిల్లా వరికుంటపాడు పెట్రోల్ బంకు సమీపంలో ఒక స్కార్పియో వాహనం వేగంగా వచ్చి డివైడర్ను ఢీకొట్టిన ఘోర ప్రమాదం జరిగింది.
Accident


నెల్లూరు , 30 అక్టోబర్ (హి.స.)

నెల్లూరు జిల్లా వరికుంటపాడు పెట్రోల్ బంకు సమీపంలో ఒక స్కార్పియో వాహనం వేగంగా వచ్చి డివైడర్ను ఢీకొట్టిన ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో వాహన డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందగా, కారులో ప్రయాణిస్తున్న మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. బాధితులు తాడిపత్రి నుంచి శ్రీకాకుళం వెళ్తుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది; గాయపడిన వారిని పోలీసులు ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande